24, జనవరి 2010, ఆదివారం

రాజకీయ నాయకుల మౌనం వెనక కారణాలు ?

కేంద్ర హోం మంత్రి చిదంబరం తో భేటి ఐన తరువాత ఆ భేటి లో పాల్గొన్న రాజకీయ నాయకుల మౌనానికి కారణాలేమిటి?

మన రాష్ట్రం కి చెందిన ప్రధాన రాజకీయ పక్షాల ప్రతినిధులు కేంద్ర హోం మంత్రి తో భేటి ఐన తరువాత భేటి వివరాలు ప్రజలకు వివరించకుండా ఉండడంలో గల కారణాలు ఏమిటి అన్న ప్రశ్న ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్న.


ఒక సున్నితమైన సమస్య మీద అఖిల పక్షం సమావేశం తరువాత ఆ సమావేశం వివరాలు గోప్యం గా ఉంచవలిసిన అవసరం ఏముంది.


ఒక్క ప్రక్క విద్యార్థులు, యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు . విద్యార్థులు తమ విద్య సంవత్సరము కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. వీరొక ప్రక్క నాయకుల ప్రకటనలు భిన్న స్వరాలూ పలుకుతున్నాయి. మొయిలీ గారు అసెంబ్లీ రద్దు పడకుండా చూస్కోండి అని మధు యాష్కీ గారు ఇచ్చిన ప్రకటన ఎటువంటి సంకేతాలు పంపుతోంది? అంటే కాంగ్రెస్ నాయకులు తమ రాజీనామాల విషయంలో పునరాలోచనలో ఉన్నారా అనే సందేహం కలుగుతోంది.
అంటే కాదు రెండు ప్రధాన పక్షాలు తమ తమ వైఖరి చెప్పకుండా తమ తమ పార్టీలలోని ఇరు వర్గాల నాయకులకు తమ పార్టీ వేదికలను తమ తమ అభిప్రాయాలను వ్యక్తికరించడానికి ఇవ్వడం ద్వారా వీరు ఆందోళనలో ఉన్న ప్రజలకు ఇచ్చే సంకేతాలేమిటి?


ప్రధాన పక్షాలు తమ వైఖరి స్పష్టం చేయడానికి సిద్ధంగా లేనప్పుడు వారి పార్టీ వేదికల ద్వారా తమ తమ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకునే ఆస్కారం ఈ ప్రాంతీయ నాయకులకు ఇవ్వకుదు.
.

అదే విధంగా తెరాస అగ్ర నాయకత్వం కేంద్ర హోం మంత్రి భేటి తరువాత ఎటువంటి ప్రకటన చేయకపోడం కుడా ఉద్యమకారుల్లో కొంత ఆందోళన గురి చేస్తోంది.

విద్యార్థులకు ఒక్కటే మనవి . ఈ రోజు ఉన్న పోటీ తత్వ ప్రపంచంలో ఒక విద్య సంవత్సరం కోల్పోవడము అంటే చాలా నష్టంకలుగుతుంది కాబట్టి విద్యార్థులు కనీసం వారానికి మూడు రోజులు తరగతులకి హాజరై మిగతా రోజులలో ఉద్యమాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుంది అనే విషయం ఫై దృష్టి పెట్టాలని కోరుతున్నాను. ఎందుకంటే ఉద్యమంలో మిగతా వర్గాలు వారి వారి వృత్తులలో పని చేసుకుంటూ ఉద్యమమలో

అంతే కాదు తెలంగాణా కు చెందిన నాయకులు వారికి నిజంగా చిత్తసుద్ధి ఉంటె వారు హైదరాబాద్ లో టీవీచానల్స్ లో మరియు జాక్ మీటింగ్స్ లో కాలయాపన చేయకుండా వారి వారి నియోజకవర్గాలో ప్రజలను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడంలో ప్రయత్నాలు చెయ్యాలి . ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం లేనిదే ఎటువంటి ఉద్యమం సఫలం కాదు

పిల్లి మేడలో గంట ఎవరు కడతారు అన్నట్టు రెండు ప్రధాన పక్షాలు ఒకరి ప్రకటన కోసం వేరొకరు ఎదురు చుస్తున్న్నట్టు ఉంది. ఈ క్రమంలో సామాన్య ప్రజలు విపరీతమైన ఆందోళనకు గురి అవుతున్నారు.

వేచి చూడు అనే సిద్ధాంతం రాజకీయాల్లో ఎల్లప్పుడూ సరి కాదు అనేది వర్తమాన పరిస్థితులు మనకు స్పష్టంగా చెపుతున్నాయి.
"సర్దార్ పటేల్ మాటల్లో చెప్పాలంటే రాష్ట్రం ఒక అందమైన ఖరీదైన శాలువా అది ఇప్పుడు ముళ్ళకంప లో చిక్కుకుపోయింది . గట్టిగా లాగితే అది ఊడి వస్తుంది కాని చీలికలు పెలికలైపోతుంది అలాగని చేతులు కట్టుక్లు కూర్చుంటే ముళ్ళు ఇంకా ఇంకా దిగబడి శాలువకు శాశ్వతంగా నష్టం కలుగ చేస్తాయి . ఒక్క పోగు కూడా రేగాకుండా ఒక్కొక్క ముల్లును తప్పించి శాలువా జాగ్రత్తగా ఇవతలకు తీయాలి"లు . ఈ వాక్యాలను పి .వి . నరసింహ రావు గారి లోపలి మనిషి అనే పుస్తకంనుంచి గ్రహించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు నిజాంప్రభుత్వానికి వ్యతిరేకం భారత ప్రభుత్వం సైనిక చర్య సందర్బ్ఘంగా సర్దార్ పటేల్ గారు చేసినవి. ఈ రోజు తెలంగాణ ఉద్యమానికి సంభదించి వర్తమాన పరిస్త్తితులకు ఇవి చక్కగా సరిపోతాయి.

ఇరు వర్గాలప్రజల మధ్య ఒక సున్నితమైన విభజన మానసికంగా వచ్చిన్నట్టు మనకు ప్రస్పష్టంగా కనిపిస్తోంది.
ఇకనైనా అన్ని ప్రధానపక్షాలు , రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తమ దృష్టి ని వెంటనే ఈ సమస్యపై కేంద్రీకరించి తక్షణ పరిష్కారం దిశ గా ఇంకా ఎటువంటి కాలయాపన చేయకుండా ప్రయత్నించాలి....

23, జనవరి 2010, శనివారం

ఐపీఎల్ ప్రా రామ్ భోత్సవ మ్యాచ్ ను ను ముంబై కి తరలించడం ఎంతవరకు సమంజసం ?

ఐ పీ ఎల్ ప్రారంభోత్సవ పోటి ని ముంబై కి తరలించడం ఎంతవరకు సమంజసం అన్నది ఈ రోజు ప్రతి డెక్కన్ చార్జెర్స్ అభిమాని లో మెదులుతున్న ప్రశ్న . ఐ పీ ఎల్ అధికారులు ఎవరిని సంప్రదిచకుండా ఇటువంటి నిర్ణయం తీసుకొనడం ఎంత వరకు సమంజసం . ప్రత్యేకించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మాజీ రాష్ట్ర మంత్రి వర్యులు ఇన నేపధ్యంలోఅంతే కాదు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఒక భాద్యతయువమైన పదవీలో ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణయాలు ఎటువంటి సంప్రదింపులు లేకుండా తీస్కోనదము కేవలం భాద్యత రాహిత్యం.
ఇక్కడ ఒక్క విషయం గమనించాలిసింది ఏమిటంటే , మొన్న పాకిస్తాన్ క్రీడాకారులను ఐ పీ ఎల్ వేలం పాటలో నిర్లక్ష్యం చేయడంలోనూ ఈవ్వాళ్ళ హైదరాబాద్ నుంచి మ్యాచ్ తరలిచండంలోను ఐ పీఎల్ అధికారులు ఒక రకమైన ఏకచత్రాధిపత్యం వహిస్తున్నరన్నది బహిరంగ సత్యం. పాకిస్తాన్ క్రీడాకారులను వేలం పాటలో నిర్లక్ష్యం చెయాడాన్ని ఎన్ని విధాల సమర్ధించుకున్న వారిని ఒక పథకం ప్రకారం వేలం పాటనుంచి బయట ఉంచారన్న సంగత ప్రతి ఒక్క క్రీడా అభిమాని కి తెలిసిన సంగతే .
కామన్ వెల్త్ గేమ్స్ లాంటి ప్రతిష్టాకరమైన పోటిలలో కూడా ఒక అధికారి వేదికలను పర్యటించకుండా సంభదిత అధ్జికరులను సంప్రదిచకుండా ఎటువంటి నిర్ణయాలు తీస్కోవడము జరగదు. అటువంటిది మార్చ్ లో జరిగే ప్రారంభోత్సవ మ్యాచ్ గురించి సంభదిత రాష్ట ప్రభువాత్వాన్ని మరియు క్రికెట్ అసోసియేషన్ ను సంప్రదిచకుండా ఇటువంటి నిర్ణయాలు తీస్కొనడం పట్ల క్రికెట్ అభిమానులు తీవ్ర అనుమానులు వ్యక్తికరిస్తున్నారు.
గతంలో హైదరాబాద్ జరిగిన ప్రపంచ బాడ్మింటన్ పోటిలప్పుడు భద్రతకు సంబంధించి అనుమానాలు వ్యక్తం ఐనప్పుడు కేంద్ర హోం మంత్రి చిదంబరం గారు స్వయాన హామీ ఇచ్చి ఆయన ఎటువంటి సెక్యూరిటీ లేకుండా badminton పోటీలు వీక్షించడము మనందరకూ తెలిసిన విషయమే .
అటువంటిది ఈ రోజు లలిత్ మోడి ఎవరిని సంప్రదించకుండా పోటీలను ముంబై కి మార్చడం వెనక గల కారణాలు ఏమిటో అన్న విషయాలు ప్రతి ఒక్క హైదరాబాద్ క్రికెట్ అభిమాని ఆలోచించాల్సిన విషయము . అంతే కాదు ఒక అంతర్జాతీయ పోటికి సంబదించిన విషయాలు దానికి సంబందిచిన అధికారులు ఇంత అనాలోచితంగా తీసుకుంటుంటే అంతర్జాతీయంగా మనము ఎటువంటి సంకేతాలు పంపిస్తున్నాము అన్న విషయము కూడా ఆలోచించాల్సిన తరుణం కూడా ఆసిన్నమైందన్న విషయం మనము ఎంతైనా గుర్తుంచుకోవాలి.