12, ఫిబ్రవరి 2010, శుక్రవారం

జుస్టిస్ శ్రీ కృష్ణ కమీషన్ విధి విధానాలు

ఇప్పుడే ఇంటికి వచ్చి టీవీ చూస్తుంటే అప్పుడే జుస్టిస్ శ్రీ కృష్ణ కమిషన్ విధి విధానాలు ప్రకటించడం జరిగింది.
ఆ విధి విధానాలు పరిశీలించిన తరువాత అసలు కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న సమస్య పట్ల ఎమైన
చిత్తశుద్ధి ఉందా అన్న అనుమానం కలుగుతోంది.
విధివిధానాలలో ముఖ్యమైనవి 1956 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్త్రంలో వివిధ ప్రాంతాలలో జరిగిన అభివృద్ధి, ఇంకా ప్రత్యెక తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో ఉద్భవించిన సమైక్య ఆంధ్ర ఉద్యమం తదుపరి పరిణామాలు వివిధ సంఘాలతో చర్చలు

ఇందులో మొదటి అంశమైన 1956 నుంచి జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకోవడానికి ఎటువంటి కమిటీ అవసరంలేదు

కేంద్రంలో మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పధకాలు వాటి అమలు గురించి సమీక్షిస్తే
ప్రభుత్వ రికార్డ్స్ ఆధారంగా పూర్తీ వివరాలాతో లభ్యం అవుతాయి.అంతే కాదు ఈ విధి విధానాలలో ఎక్కడ పెద్దమనుషుల ఒప్పందం దాని ఉల్లంఘన 610 ప్రభుత్వ ఉత్తరువుల అమలు పరచకపోవడం వంటి అంశాలు గురించి ఎక్కడ ప్రస్తావన లేదు . ఒక విధంగా చూస్తే ఈ కమిటి విధి విధానాలు పూర్తిగా సమైక్య ఆంధ్ర నాయకుల సూచనల మేరకే వారికి అనుగుణంగా ఉన్దేవిధానంగా ఖరారు చేసినట్టుగా స్పష్టం అవుతోంది . ఎక్కడా ప్రత్యెక తెలంగాణా ఉద్యమ చారిత్రాత్మక నేపధ్యం తెలంగాణా ప్రాంత నిర్లక్ష్యం ఇక్కడి వెనుకబాటి తనం వాటి కారణాలు ఏవీ కూడా పరిగణలో తీసుకున్న దాఖలాలు ఏవి లేవు.కమిటి ద్వారా విచారించినా లేదా ప్రభుత్వ పధకాలు అమలు పరిశీలించినా తెలంగాణా ప్రాతం పూర్తిగా నిర్లక్ష్యం కి గురి ఐన సంగతి నూటికి నూరుపాళ్ళ నిజం' . ఈ కమిటి నియామకం తరువాత విధి విధానాలు ఖరారు గమనిస్తే తెలంగాణా ప్రజలను వారి మనోభావాలను మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ వంచించింది. డిసెంబర్ 9 వ తేది నాడు ప్రకిటించిన రోడ్ మ్యాప్ దాఖలాలు ఏవి ఈ విధి విధానాలలో లేవు. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ కమిటి ని రద్దు పరిచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కి గతంలో ప్రకటించిన విధంగా ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలి . ఈ కమిటి నియామకం తరువాత పరిణామాలు గమనిస్తే ఇవి కేవలం కాలయాపన కోసం తప్పిస్తే సమస్య పరిష్కారం కోసం కాదు .
నీటిరంగంలో, విద్య, వ్యవసాయం, వైద్య మరియు ఉద్యోగ రంగాలలో తెలంగాణ ప్రాతం పట్ల వివక్షత గురించి తెలిసుకోడానికి కేవలం ప్రభత్వ పధకాల అమలు గురించి రికార్డ్స్ పరిశీలిస్తే చాలు వీటి కోసం కమిటిల నియామకం అవసరంలేదు

ఇప్పుడే తెలిసింది తెలంగాణ తెదేపా శాసన సభ్యులు రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారని. ఈ నిర్ణయం పూర్తీ హర్షదాయకం . కాని ఈ నిర్ణయానికి ఆ సభ్యులు కట్టుబడి ఉండాలి. తెరాస మరియు తెదేపా శాసన సభ్యులు తమ తమ రాజీనామాల విషయంలో కట్టుబడి ఉంటె కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా తప్పనిసరిగా రాజీనామాలు చేయాల్సిన అవసరం వస్తుంది తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వత్తిడి పెంచ వచ్చు.
.

1 కామెంట్‌: